తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ... పాత శ్రీ కాలేజీ స్థలంలో...

తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ... పాత శ్రీ కాలేజీ స్థలంలో...

ప్రముఖ విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏపీలో తన విద్యాసంస్థల ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మల్లారెడ్డి. యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు లభించాయని వెల్లడించారు. శుక్రవారం ( జులై 10 ) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఈమేరకు అధికారిక ప్రకటన చేశారు.

గత 35 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలందిస్తున్నానని... తిరుపతిలో యూనివర్సిటీ స్థాపించాలన్న తన చిరకాల కల నెరవేరిందని అన్నారు మల్లారెడ్డి. 2025లోనే ఈ ఆలోచన చేశానని... శ్రీవారి దయతో ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని అన్నారు. 

తెలంగాణలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో తన విద్యా సామ్రాజ్జ్యన్ని విస్తరించిన మల్లారెడ్డి ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు.గతేడాది తిరుపతి, విశాఖపట్నంలలో కాలేజీలు కొనుగోలు చేశారు మల్లారెడ్డి.శ్రీవారి ఆశీస్సులతో దేశవ్యాప్తంగా తన విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు మల్లారెడ్డి.