భారత అథ్లెట్ అనిమేశ్ కుజుర్ రికార్డు సృస్టించాడు. విదేశీ గడ్డపై అతి తక్కువ సమయంలో 100 మీటర్ల పరుగు పూర్తి చేసుకున్న అథ్లెట్ గా చరిత్రకెక్కాడు. జర్మనీలో జరుగుతున్న పుమా ఫాస్ట్ ఆర్మ్ ఫాస్ట్ లెగ్స్ 2026 (PUMA Fast Arms Fast Legs 2026) 100 మీటర్ల ఫైనల్ రేసులో కేవలం 10.14 సెకన్లలో ఫినిష్ చేసి రికార్డు సృష్టించాడు.
విదేశీ గడ్డపై100 మీటర్ల పరుగు పందెంలో ఇంత తక్కువ సమయంలో భారత అథ్లెట్ పూర్తిచేయడం ఇదే తొలిసారి. ఇక ఇండియాలో జాతీయ స్థాయిలో గురిందర్‌వీర్ సింగ్ రికార్డు10.09 సెకన్లతో తొలి స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 100 మీటర్ల పరుగుత పందెంలో ఒక ఇండియన్ సాధించిన రెండవ అత్యంత వేగవంతమైన రికార్డు ఇది కావడం విశేషం.
ALSO READ : లార్డ్స్ వేదికగా స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్..
ఒడిశాకు చెందిన నిమేష్ ఈ లేటెస్ట్ పరుగుతో, తన మునుపటి బెస్ట్ పర్ఫామెన్స్ అయిన 10.15 సెకన్ల రికార్డును అధిగమంచాడు. ఇప్పటికే పురుషుల 200 మీటర్లలో జాతీయ రికార్డు హోల్డర్ అయిన అనిమేష్, షార్ట్ డిస్టెన్స్ పరుగులో కూడా ఇండియా అత్యంత వేగవంతమైన స్ప్రింటర్లలో ఒకరిగా నిరూపించుకున్నాడు. ఇక ఆలోవర్ ఇండియా వ్యాప్తంగా 100 మీటర్ల రికార్డ్స్ చూస్తే.. టాప్ 5 రికార్డ్స్ అనిమేశ్ పేరునే ఉన్నాయి.
ఇండియా టాప్ 5 100 మీ. రికార్డ్స్:
- గురిందర్వీర్ సింగ్ - 10.09s
- అనిమేష్ కుజుర్ - 10.14s
- అనిమేష్ కుజుర్ - 10.15 సెకన్లు
- గురిందర్‌వీర్ సింగ్ - 10.17 సెకన్లు
- అనిమేష్ కుజుర్ - 10.18s
