టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. బాధితుల నుంచి రూ.3కోట్ల వరకు వసూల్

టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. బాధితుల నుంచి రూ.3కోట్ల వరకు వసూల్

తిరుమల: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగాల పేరిట భారీ స్కాం వెలుగు చూసింది. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులనుంచి నిందితుడు  లక్షలు దండుకున్నాడు ఓ మోసగాడు.  టీటీడీ ఉద్యోగాల పేరిట దాదాపు రూ. 3కోట్ల వరకు స్కాం జరిగినట్లు తెలుస్తోంది. అడ్వకేట్ గా పరిచయం చేసుకొని నిరుద్యోగులను నమ్మించి నకిలి  అపాయింట్ మెంట్ ఆర్డర్లతో నట్టేట ముంచాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసగాడి మోసాల దందా బయటికొచ్చింది.. వివరాల్లోకి వెళితే.. 

లాయర్ గా నిరుద్యోగులను పరిచయం చేసుకుని టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ లోగోతో ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్స్  సృష్టించిన కిరణ్ కుమార్ రెడ్డి టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం సుబ్రమణ్యం ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితులను మోసగించాడు.

ALSO READ : అయోధ్య హుండీల్లో 10, 20 రూపాయల నోట్లే.. 

 బాధితులు ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు  చేశాడు. ఫేక్ అపాయింట్ మెట్ ఆర్డర్లు  చేతిలోపెట్టి, ఇదిగో  జాయినింగ్.. అదిగో జాయినింగ్ అంటూ  కాలయాపన చేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తిరుపతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.  దాదాప 25 మంది ఈ మోసగాడి వలలో పడినట్లు తెలుస్తోంది. దాదాపు3కోట్ల రూపాయలకు మోసం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేపట్టారు తిరుపతి ఈస్ట్ పోలీసులు.