సాధారణ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్.. E 20 పెట్రోల్ వల్ల వాహనాల్లో మైలేజీ కొంచెం తగ్గుతున్న మాట వాస్తవమే అని అంగీకరించింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. తగ్గుతున్న మైలేజీ 3 నుంచి 5 శాతంగానే ఉందని.. తగ్గుతున్న మైలేజీతో పోల్చితే ఈ 20 పెట్రోల్ వల్ల పొల్యూషన్ బాగా తగ్గుతుందంటూ సమర్థించుకున్నది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.
ఈ20 పెట్రోల్ వాడితే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటోంది పెట్రోలియం శాఖ.పికప్, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది.. కాలుష్యాన్ని తగ్గిస్తుందని స్పష్టం చేసింది. ఈ20 పెట్రోల్‌ను ఒక్కసారిగా అమల్లోకి తీసుకురాలేదని ,దీనిపై ఎన్నో సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించి, ఆటోమొబైల్ కంపెనీలతో చర్చలు జరిపిన తర్వాతే దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపింది.
ALSO READ : రేటు ఎక్కువైనా మంచి పెట్రోలే కొట్టిచ్చుకుంటాం..
2001లో ఈ 20 పెట్రోల్ ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. 2006లో 5 శాతం, 2022లో 10 శాతం, 2025-26 నాటికి 20 శాతం బ్లెండింగ్‌ను అమలు చేస్తున్నారు. ఈ20 పెట్రోల్ పై ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా సుముఖంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మైలేజీ కొద్దిగా తగ్గినా, పర్యావరణం రక్షణ, చమురు దిగుమతులు తగ్గింపు, స్వదేశీ పెట్రోల్ ఉత్పత్తుల వాడకం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
