BSNL శాటిలైట్ ఫోన్లు రీఛార్జ్ ప్లాన్స్ చూస్తే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. నిమిషానికి 175 రూపాయలు అంట..!

BSNL శాటిలైట్ ఫోన్లు రీఛార్జ్ ప్లాన్స్ చూస్తే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. నిమిషానికి 175 రూపాయలు అంట..!

BSNL.. శాటిలైట్ ఫోన్లు లాంచ్ చేసింది. మార్కెట్ లోకి తీసుకొచ్చేసింది. మోడల్ చూస్తే వారేవా అంటున్నారు జనం. ఇక సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉండదు.. ఎంచక్కా శాటిలైట్ ఫోన్లు కొనేసుకుందాం.. బీభత్సంగా వాడేద్దాం అనుకుంటున్నారు చాలా మంది. సోషల్ మీడియాలో కామెంట్లు ఇలాగే ఉన్నాయి. 

నిజమే.. BSNL శాటిలైట్ ఫోన్ల లుక్ బాగున్నాయి. ఐ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ కంటే ధర తక్కువే. ఈ శాటిలైట్ ఫోన్ లక్షా 34 వేల రూపాయలకే వస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. రీఛార్జ్ రేట్లు చూసి గుడ్లు తేలేయటం ఖాయం. 

ఐ ఫోన్ ధర ఎక్కువైనా కామన్ రీఛార్జ్ ఉంటుంది.. రెగ్యులర్ రీ ఛార్జ్ చేస్తే సరిపోతుంది. సో.. ఐ ఫోన్ పై వన్ టైం ఇన్వెస్ట్ మెంట్. 
BSNL శాటిలైట్ ఫోన్ రీ ఛార్జ్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. శాటిలైట్ ఫోన్ నెల వారీ కనీస రీ ఛార్జ్ ఎంతో తెలుసా.. 3 వేల 500 రూపాయలు.నెలకు కనీస రీ ఛార్జ్ 3 వేల 500 రూపాయలతో చేయించాలి. అది కూడా 20 నిమిషాల టాక్ టైం.. SMS ఫ్రీ.. అంటే నిమిషానికి 175 రూపాయలు పడింది.. ఇది స్టార్టింగ్ ప్యాకేజీ మాత్రమే.. మొత్తం రీ ఛార్జ్ ప్లాన్స్ చూస్తే ఆస్తులు అమ్ముకోవాలా ఏంటీ అనే డైలాగ్ రావటం ఖాయం..

ఇదే క్రమంలో కమర్షియల్ యూజర్లకు నెలకు రూ.5వేల 835 చెల్లించాల్సి ఉంటోంది. ఇందులో 30 నిమిషాల పాటు ఉచిత వాయిల్ కాల్స్ అందించబడుతున్నాయి. అలాగే వార్షిక ప్లాన్ రూ.64వేల 185 ఉండగా దీనికింద 360 ఉచిత నిమిషాల పాటు టాక్ టైం అందించబడుతోంది.