తిరుమలకు పోటెత్తిన భక్తులు... సర్వదర్శనానికి 30 గంటలు...

తిరుమలకు పోటెత్తిన భక్తులు... సర్వదర్శనానికి 30 గంటలు...

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు . వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఈ క్రమంలో శనివారం ( జులై 11 ) తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది.  వైకుంఠం లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట రింగ్ రోడ్డు దాటి పాచికాల్వ గంగమ్మ గుడి  వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి 30 గంటలు సమయం పడుతోంది. SSD టోకన్ భక్తులకు 12 గంటలు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.

ఇదిలా ఉండగా.. శుక్రవారం 73 వేల 265 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు అధికారులు. 39 వేల 690 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్ల 26 లక్షలు వచ్చినట్లు తెలిపారు టీటీడీ అధికారులు. 4 లక్షల 9 వేల తిరుమల లడ్డూలను భక్తులు కొనుగోలు చేయగా, 2 లక్షల 98 వేల మంది అన్న ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు టీటీడీ అధికారులు.