హైదరాబాద్, వెలుగు: టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ కలిసి తెలంగాణలో రెండు కొత్త అల్ట్రా ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాయి. హైదరాబాద్, విజయవాడను కలిపే ఎన్‌హెచ్– 65 రోడ్డుపై ఇవి అందుబాటులోకి వచ్చాయి.
నార్కట్‌పల్లి వివేరా జంక్షన్ వద్ద రెండు 120 కిలోవాట్ చార్జర్లు, సూర్యాపేట 7 మిడ్‌వే ప్లాజా వద్ద రెండు డిస్పెన్సర్లు గల 240 కిలోవాట్ ఆల్ట్రా ఫాస్ట్ డీసీ చార్జర్ ఏర్పాటు చేశారు.
వీటితో కలుపుకుంటే తెలంగాణ వ్యాప్తంగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ పాయింట్ల సంఖ్య 150 దాటింది. టాటా పవర్ 690 నగరాల్లో 2.3 లక్షల హోమ్ చార్జర్లు, 6,500 పబ్లిక్ చార్జర్లు, 1,200 ఈ–బస్ చార్జింగ్ పాయింట్లను అమర్చింది.
