పానుగల్ మండలంలోని బాలపిర్ల దర్గా అభివృద్ధికి రూ.కోటి మంజూరు

పానుగల్ మండలంలోని బాలపిర్ల దర్గా అభివృద్ధికి రూ.కోటి మంజూరు

పానుగల్, వెలుగు : పానుగల్ మండలంలోని ప్రసిద్ధి చెందిన బాలపిర్ల (భార్ షాహిద్) దర్గా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. కుల, మత భేదాలు లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ దర్గా వద్ద మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అధికారులతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించి ప్రత్యేక చొరవ చూపడంతో ఈ నిధులు మంజూరవుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినందుకు గాను మంత్రి జూపల్లి కృష్ణారావుకు దర్గా కమిటీ సభ్యులు, భక్తులు, మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.