రోషన్ కనకాల హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. సైఫై ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో విజయ్ కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్ వీఐ ఆనంద్ దగ్గర చీఫ్ అసోసియేట్‌గా, డైలాగ్ రైటర్‌గా వర్క్ చేసిన విజయ్.. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, స్వయంభు చిత్రాలకు పని చేశాడు. ఇప్పుడు ఈ చిత్రానికి వీఐ ఆనంద్ కథను అందించగా, విజయ్ దర్శకత్వంతోపాటు స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నాడు.
గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టాడు. సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ కెమెరా స్విచాన్ చేశాడు. దర్శకుడు వీఐ ఆనంద్ స్క్రిప్ట్ అందజేసి, ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించాడు. గహజి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా అన్వేష్ వరాల, ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా బ్రహ్మ కడలి వర్క్ చేస్తున్నారు. ప్రీ -ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
