భార్యను ముట్టుకుంటే షాక్.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ 'ఓ..! సుకుమారి' క్రేజీ ట్రైలర్ అవుట్!

భార్యను ముట్టుకుంటే షాక్.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ 'ఓ..! సుకుమారి' క్రేజీ ట్రైలర్ అవుట్!

'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓ..! సుకుమారి'. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ద్వారా భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'శివం భజే' వంటి వైవిధ్యమైన సినిమా తర్వాత గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. లేటెస్ట్ గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.

షాకింగ్ కథేంటంటే..

ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వుల పండగ గ్యారెంటీ అనిపిస్తోంది. పల్లెటూరి నేపథ్యం, స్వచ్ఛమైన ప్రేమ, కడుపుబ్బా నవ్వించే కామెడీతో సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. ఊరంతా భయపడే ఒక విచిత్రమైన సమస్య ఉన్న దామిని (ఐశ్వర్య రాజేష్) అనే అల్లరి అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమెను ఎవరు తాకినా సరే... గట్టిగా సఎలక్ట్రిక్ షాక్స కొడుతుంది.

ALSO READ : Vasudevasutam Review: జగన్నాథుడి రహస్యాలు.. 

ఈ వింత రహస్యాన్ని దాచిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులు అమాయకుడైన హీరో (తిరువీర్)తో పెళ్లి జరిపిస్తారు. ఫస్ట్ నైట్ నుండి హీరోకి అసలు సినిమా మొదలవుతుంది. భార్యను ముట్టుకుంటే షాక్ కొట్టే ఈ విచిత్రమైన పరిస్థితి నుండి ఆ కొత్త జంట ఎలా బయటపడింది? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుని ప్రేమలో పడ్డారు? అనే సరికొత్త కాన్సెప్ట్‌ను డైరెక్టర్ భరత్ దర్శన్ వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు.

 కామెడీ ట్రాక్ నెక్స్ట్ లెవెల్‌లో..

పల్లెటూరి కుర్రాడిగా తిరువీర్ టైమింగ్, ఐశ్వర్య రాజేష్ పవర్‌ఫుల్ నటన సినిమాకు మెయిన్ పిల్లర్స్. మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్ (మ్యాడ్ ఫేమ్), ఝాన్సీ, ఆమని, ఆనంద్‌కోట జయరాంల కామెడీ ట్రాక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది.  సి.హెచ్. కుషేందర్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను అద్భుతంగా చూపించగా, భరత్ మంచిరాజు మ్యూజిక్, 'బలగం' ఫేమ్ తిరుమల ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు గ్రాండ్‌నెస్ తెచ్చాయి.  జూలై 17న ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్న  క్రేజీ లవ్ స్టోరీ ' ఓ..! సుకుమారి' బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.