టాలీవుడ్‌లో భక్తిరసానికి కాస్త మిస్టరీ తోడైతే వచ్చే కిక్కే వేరు. కార్తికేయ-2 లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత, అదే కోవలో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టడానికి వచ్చేసింది సరికొత్త విజువల్ డివోషనల్ థ్రిల్లర్ 'వసుదేవసుతం'. మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా, వైకుంఠ్ బోను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు (జూలై 10, 2026) థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారు.
కథేంటి?
ప్రసిద్ధ పూరి జగన్నాథ్ ఆలయ నేపథ్యంలో.. శతాబ్దాలుగా దాగున్న రహస్యాలు, అత్యంత పవిత్రమైన 'బ్రహ్మపదార్థం', గుప్తనిధుల చుట్టూ తిరిగే ఒక మైండ్ బ్లోయింగ్ కల్పిత కథ ఇది. పురుషోత్తమపురిలోని ప్రముఖ వాసుదేవ ఆలయ చైర్మన్ ఎన్నికల చుట్టూ కథ రసవత్తరంగా మారుతుంది. ఆ పీఠాన్ని దక్కించుకోవడం కోసం క్రూరమైన విలన్ హీరా బంధు (మైమ్ గోపి) చేసే కుట్రలతో సినిమా మొదలవుతుంది. ఈ సమయంలోనే హైదరాబాద్ నుండి ఉత్సవాల కోసం ఊరికి వస్తాడు హీరో కృశవ్ (మహేంద్రన్). అక్కడ హీరా బంధు మేనకోడలు భువి (అంబికా వాణి)తో ప్రేమలో పడతాడు.
అయితే, కథ అక్కడ మలుపు తిరగదు... అసలు ట్విస్ట్ 'కోయిరాతల' అనే గుప్త నిధుల రహస్య ప్రదేశంతో మొదలవుతుంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కృశవ్ ఆ నిధి రహస్యాన్ని అన్వేషించడం ఎందుకు మొదలుపెట్టాడు? ఇంటర్వెల్ లో సెంట్రల్ మినిస్టర్ (జాన్ విజయ్) ఎంట్రీతో హీరో బ్యాక్‌గ్రౌండ్ గురించి వచ్చే ఆ షాకింగ్ ట్విస్ట్ ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేస్తుంది..
ఎవరెవరు ఎలా చేశారంటే?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఇందులో వన్-మ్యాన్ షో చేశాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో పరిణతి చెందిన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అంబికా వాణి గ్లామర్‌తో పాటు నటనతోనూ మార్కులు కొట్టేసింది. రాజీవ్ కనకాల, ఆటో రామ్ ప్రసాద్, తులసి, దువ్వాసి మోహన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో దేవుడు, గరుత్మంతుడు, పాముల ఎంట్రీ సీన్స్‌ను ఇండియన్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త AI విజువల్స్ టెక్నాలజీతో చూపించారు. ఈ గ్రాఫిక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని ఇస్తాయి.
హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ..
కేవలం సస్పెన్స్ మాత్రమే కాదు, హీరో అక్కా-బావల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తాయి. సెకండ్ హాఫ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది . ప్రీ-క్లైమాక్స్ లో అసలు విలన్ ఎవరో తెలిసే సీన్ సీట్ల అంచున కూర్చోబెడుతుంది. అలాగే క్లైమాక్స్‌లో పార్ట్ 2 కి ఇచ్చిన క్రేజీ లీడ్... పార్ట్ 2 పై అంచనాలను -మరింత హైప్ కు తీసుకెళ్లింది.
డైరెక్టర్ వైకుంఠ్ బోను దైవిక రహస్యాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కలిపి నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో గుస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు సినీ ప్రియులు. భక్తి, ఉత్కంఠ, యాక్షన్ , అద్భుతమైన విజువల్ వండర్‌ను ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుంటే, ఈ వీకెండ్‌కు ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ పర్ఫెక్ట్ క్లీన్ అండ్ థ్రిల్లింగ్ మూవీ అని అభిప్రాయపడుతున్నారు.
