క్రేజీ ప్రాజెక్ట్ తో మీనాక్షి చౌదరి శాండల్‌‌వుడ్‌‌ ఎంట్రీ..?

క్రేజీ ప్రాజెక్ట్ తో మీనాక్షి చౌదరి శాండల్‌‌వుడ్‌‌ ఎంట్రీ..?

సంక్రాంతికి వ‌‌స్తున్నాం, ల‌‌క్కీ భాస్కర్‌‌‌‌ లాంటి సక్సెస్‌‌ఫుల్‌‌ సినిమాలతో ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒకరాజు’తో మరో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాగచైతన్యకు జంటగా ‘వృషకర్మ’లో నటిస్తున్న ఆమె.. మరోవైపు కార్తికి జంటగా ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్‌‌ మూవీ చేస్తోంది. ఇవికాక మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌లో తన పేరు వినిపిస్తోంది. యశ్‌‌ హీరోగా నటించబోయే కొత్త చిత్రం కోసం ఆమెను హీరోయిన్‌‌గా సంప్రదించినట్టు సమాచారం. 

ఆగస్టులో ‘టాక్సిక్‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న యశ్‌‌.. ఆ తర్వాత ఓ రొమాంటిక్ యాక్షన్‌‌ మూవీలో నటించబోతున్నాడు. శివరాజ్ కుమార్‌‌‌‌తో ‘మఫ్టీ’ అనే బ్లాక్ బస్టర్‌‌‌‌ తీసిన నార్తన్‌‌ దీనికి దర్శకుడు. ఇందులో తన గత చిత్రాలకు భిన్నంగా  కొత్త లుక్‌‌లో కనిపించబోతున్నాడట యశ్.

ఇందులో హీరోయిన్‌‌గా మొదట ‘యానిమల్‌‌’ ఫేమ్ త్రిప్తి డిమ్రీ పేరు వినిపించింది. తాజాగా మీనాక్షి చౌదరి పేరు తెరపైకొచ్చింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ శాండిల్‌‌వుడ్‌‌ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షి.. తన డెబ్యూకి యశ్ మూవీ పర్ఫెక్ట్‌‌ అని భావిస్తోందట.