వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.
తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో వరుణ్ తేజ్ ఒక చేతిలో రక్తం మరకలున్న కత్తి, మరో చేతిలో గ్రెనేడ్‌తో కుర్చీలో హుందాగా కూర్చుని, రఫ్ అండ్ స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.
‘కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ ఎలిమెంట్స్‌తో ఫన్నీగా చూపిస్తూ భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
