హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతుండటంతో హైదరాబాద్లో ఆఫీసు స్థలాలకు గిరాకీ పెరిగిందని రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం.. 2026 మొదటి ఆర్నెళ్లలో ఆఫీస్ లీజింగ్ లావాదేవీల పరిమాణం ఏడాది లెక్కన 29 శాతం పెరిగి 7.5 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.
నెల సగటు అద్దె ఏడు శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.80 గా నమోదైంది. జీసీసీలు అత్యధికంగా 45 శాతం వాటాతో 3.4 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించాయి. నగరంలో ఖాళీల రేటు 11.5 శాతానికి తగ్గింది. ఈకాలంలో 19,249 ఇండ్లు అమ్ముడయ్యాయి.
