జ్యోతిష్యం : సింహరాశిలోకి శుక్రుడు.. కేతువు.. 4 రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు

జ్యోతిష్యం : సింహరాశిలోకి  శుక్రుడు.. కేతువు.. 4 రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  జులై 11న అత్యంత కీలకమైన, శక్తిమంతమైన గ్రహ మార్పులు జరిగాయి.    12:50 గంటలకు సింహ రాశిలో  శుక్రుడు ,కేతువు కలవనున్నారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ప్రేమ, సంపదలు, భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడు, విరక్తిని కలిగించే కేతువుతో కలవడం వల్ల సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలలో ఊహించని మార్పులు, కర్మ సంబంధమైన పనులు జరుగుతాయి.  . ఈ రెండు భిన్న స్వభావాలు గల గ్రహాలు కలవడం వల్ల మానవ సంబంధాలు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత ఆలోచనలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

మేష రాశి:  శుక్రుడు.. కేతువు  సింహరాశిలో కలవడం వలన ఈ రాశి వారికి ప్రేమ సంబంధాలు, పిల్లల విషయాల్లో  ప్రేమ వ్యవహారాలలో ఊహించని మార్పులు రావచ్చు.    కోపం.. అసహనం పెరిగే అవకాశం ఉంది.  కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలిగే అవకాశం ఉంది.  వాహనం డ్రైవింగ్​ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.  ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  చేపట్టిన పనులు ఆలస్యం కావడం.. రావలసిన డబ్బులు చేతికి అందకపోవడం.. ఖర్చులు పెరగడం  వలన ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఒక్కోసారి అన్నీ వదిలేసి ఎటో వెళ్లిపోవాలని అనిపిస్తుందని పండితులు చెబుతున్నారు. 

 కర్కాటక రాశి:  శుక్రుడు.. కేతువు .. సింహరాశిలో కలవడం వలన ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి,  భావోద్వేగాల తీవ్రత అధికంగా ఉంటుంది.  వృత్తి పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.  కుటుంబ సంబంధాల్లో, మాటతీరులో కాస్త సంయమనం పాటించాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.  తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు..  ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని...  ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు. .

తులారాశి : ఈ రాశి వారికి ఇది అత్యంత కీలక సమయం. భాగస్వామ్యాలు, వివాహ సంబంధాల్లో అహంకారాన్ని పక్కనబెట్టి సర్దుకుపోవడం చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు ఆర్థిక వ్యవహారాలు, ఖర్చుల విషయంలో సమతుల్యత పాటించడం అత్యవసరం.  కొన్ని కర్మ సంబంధమైన సవాళ్లు ఎదురవుతాయి. అనవసర వ్యయాలను నియంత్రించుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.  వ్యక్తుల పట్ల అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. నిరంతర కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, మితిమీరిన పనుల వలన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.  డబ్బు విషయాల్లో, మానసిక ఆందోళనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మాట తీరు స్పష్టంగా ఉంచుకోవాలి.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.బంధుత్వాలు, స్నేహాల విషయంలో సహనం చాల​అసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభరాశి:  శుక్రుడు.. కేతువు సింహరాశిలో కలవడం వలన ఈరాశి వారికి సామాజిక సంబంధాలు, స్నేహాలు, ఆర్థిక పెట్టుబడులలో అనూహ్యమైన మార్పులను ఆశిస్తారు.  వృత్తి జీవితం, కెరీర్ విషయంలో కర్మ సంబంధమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో అధికారులతో లేదా సహోద్యోగులతో అనవసర వాదనలకు దిగకుండా, మీ పనితీరుపై మాత్రమే దృష్టి సారించడం ద్వారా కెరీర్ స్థిరత్వాన్ని కాపాడుకోవాలి. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ సామాజిక ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది.  తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు.  సహోద్యోగులు.. తోటి వారి పట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. గతంలో మీనుంచి సాయం పొందిన వారు.. ఇప్పుడు ముఖం చాటేస్తారు.  ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి పరిస్థితులు నెలకొంటాయి.  అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.   

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.