న్యూఢిల్లీ: తాను ఆధునిక గాంధీనో, సినీ హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. ప్రజలు నాయకత్వం కోసం ఇతరుల వైపు చూడకుండా.. ఎవరి జీవితాలకు వారే హీరోలు కావాలని ఆయన సూచించారు. నీట్ సహా పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన శనివారం నాటికి 22వ రోజుకు చేరుకుంది.
అందులో భాగంగా వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. ఈ క్రమంలో వాంగ్‌చుక్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘చాలామంది నన్ను 21వ శతాబ్దపు గాంధీ, మరికొందరు హీరో అని పిలుస్తున్నారు. అలా పిలవొద్దు. నేను కేవలం నా బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించిన ఒక సామాన్యుడిని’ అని అన్నారు.
