రేపటి (జూలై 13) నుంచి బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’

రేపటి (జూలై 13) నుంచి బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రెండు రోజుల టూర్ 
  • కార్మికులతో ముఖాముఖి.. గనుల వద్ద గేట్ మీటింగ్‌‌లు

హైదరాబాద్, వెలుగు: కేంద్రం ఇటీవల తాడిచర్ల 2 బ్లాక్​ను సింగరేణికి కేటాయించడంతో దీనిని కార్మికుల్లోకి తీసుకెళ్లడంతోపాటు వారి సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’కు శ్రీకారం చుట్టింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు బొగ్గు గనుల ప్రాంతాల్లో నేతలు పర్యటించనున్నారు.

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి కిషన్ రెడ్డి కోల్​బెల్ట్​ ప్రాంతాల్లోని గనులను సందర్శించి, కార్మికులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌‌ను శనివారం బీజేపీ నేతలు హైదరాబాద్​లో రిలీజ్ చేశారు.