దేవాలయానికి వెళితే ఆందోళన తగ్గి.. మనశ్శాంతికి కారణం ఏమిటి.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

దేవాలయానికి వెళితే ఆందోళన తగ్గి.. మనశ్శాంతికి కారణం ఏమిటి.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

యూత్​ పోకడ ఆందోళనగా ఉంటుంది.  ప్రతి చిన్న దానికి గాబరా పడతారు.  మనశ్శాంతి లేక చాలా సతమతమవుతుంటారు. మానవుల అందరి జీవితాల్లో ఇది సర్వ సాధారణం.  అలాంటి సమయాల్లో కొద్దిసేపు . ధ్యానం .. మెడిటేషన్​ చేయాలని.. దగ్గరలోని దేవాలయానికి వెళితే మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. నిజంగా దేవాలయానికి  వెళితే ఒత్తిడి తగ్గుతుందా.. మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .!

మనశ్శాంతి కోసం ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మీకు నచ్చిన పనులు చేయడం, కుటుంబంతో గడపడం మరియు ప్రకృతిలో కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది

ప్రస్తుతం లైఫ్​ అంతా టెన్షన్​ జీవితమే.. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి బెడ్​పై నిద్రించే వరకు ఒత్తిడి.. ఆలోచనతో .. మానసిక ప్రశాంతతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. టెన్షన్​ నుంచి రిలీఫ్​పొందడానికి కొద్దిసేపు మెడిటేషన్​ చేయాలని పండితులు చెబుతున్నారు. 

ప్రస్తుతం దేవాలయానికి వెళ్లినా సరే లేని పోని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.  కాని అలా చేయడం వలన  ఎలాంటి ఉపయోగం లేదని పండితులు చెబుతున్నారు. దేవాలయానికి మానసిక ప్రశాంతతకు.. ఒత్తిడి.. ఆందోళన తగ్గి సానుకూల భావనను అనుభవించడానికి వెళుతుంటారు. దేవాలయ ప్రాంగణంలో చేసే హోమాలు.. పూజలు.. జపాల వలన ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలుగా మారతాయి. అలాంటి పవిత్ర ప్రదేశాల్లో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేస్తే మనసు ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడి ప్రశాంతత వైపు మళ్లుతుందని విశ్వసిస్తారు.  అందుకే గుడిలో భక్తితో ప్రార్థన చేసేటప్పుడు మనలో కొంత శక్తి చేరుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

దేవాలయంలో కొన్ని నిమిషాలు భక్తితో.. ఏకాగ్రతతో  ధ్యానం చేయడం కూడా గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.  అలాంటి ప్రదేశాల్లో ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతమై, అంతర్గత సానుకూలత పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాల ద్వారా తెలుస్తుంది. 

ఆధ్యాత్మిక శక్తి కేంద్రంలో నిశ్శబ్దంగా ధ్యానం చేసినప్పుడు మనస్సు క్రమంగా ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.  దేవాలయంలో ధ్యానం చేయడం వల్ల మనస్సులోని ఒత్తిడి, అశాంతి తగ్గి, ప్రశాంతత పెరుగుతుంది. . అలాగే, మానసిక గందరగోళం, బాహ్య పరధ్యానాలు తగ్గడంతో ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు. 

ప్రస్తుత యుగంలో  జీవనశైలిలో ప్రజలు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిరంతరం శబ్దం, ఒత్తిడి, సామాజిక పరస్పర చర్యల మధ్య ఉండటం వల్ల మానసిక అలసట సహజంగా  ఏర్పడుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో పవిత్రమైన దేవాలయంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా ధ్యానం చేయడం మనసుకు విశ్రాంతి కలిగి... మానసిక ఒత్తిడిని తగ్గించి, సానుకూల ఆలోచనలు పెరిగి..ప్రశాంతంగా, సమతుల్యంగా, ఉత్తేజంగా అనుభూతి చెందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.