Argentina vs Switzerland: ఫిఫా వరల్డ్ కప్ ( FIFA World Cup 2026) టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఊహించని రేంజ్ ఉత్కంఠను దాటుకుని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ జట్టును 3- 1తో గోల్స్ తేడాతో అర్జెంటీనా మట్టికరిపించింది. నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఆ అదనపు 30 నిమిషాల ఫైట్ లో అర్జెంటీనా ప్లేయర్లు తమ వరల్డ్ క్లాస్ ఆటతో మరో రెండు గోల్స్ సాధించి టోర్నీలో తమ టైటిల్ వేటను సజీవంగా ఉంచుకున్నారు.
అటాకింగ్ గేమ్‌తో హీటెక్కిన స్టేడియం:
మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు అటాకింగ్ గేమ్‌తో మైదానాన్ని హీటెక్కించాయి. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ అలెక్సిస్ మాక్ అలిస్టర్.. కార్నర్ కిక్ ద్వారా అందిన బంతిని అద్భుతమైన టవరింగ్ హెడర్ తో నెట్‌లోకి పంపి జట్టుకు తొలి గోల్ అందించాడు. లీనల్ స్కలోని సలహాలతో దూసుకెళ్తున్న అర్జెంటీనాకు స్విట్జర్లాండ్ డిఫెండర్లు గట్టి పోటీ ఇచ్చారు. పట్టువదలకుండా పోరాడిన స్విస్ జట్టు మ్యాచ్ ముగిసేలోపు ఒక అద్భుతమైన ఈక్వలైజర్ గోల్ సాధించి స్కోరును 1–1తో ఈక్వల్ చేసేసింది. దీంతో క్వార్టర్ ఫైనల్ పోరు కాస్తా ఎక్స్‌ట్రా టైమ్ ఉత్కంఠకు దారి తీసింది.
మైదానంలో మెస్సీ అగ్రెసివ్:
ఈ మ్యాచ్ అంతటా వివాదాలు కొనసాగాయి. రెఫరీ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు మ్యాచ్‌ను మరింత హీటెక్కించాయి. ఒక దశలో అర్జెంటీనా లెజెండ్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ మైదానంలోనే తీవ్ర అసహనానికి గురై, రెఫరీ, ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి (Heated Moments) దిగడం కెమెరాలకు చిక్కింది. స్విట్జర్లాండ్ ప్లేయర్స్ శారీరక బలాన్ని నమ్ముకుని అర్జెంటీనాను అడ్డుకోవాలని చూసినప్పటికీ, మెస్సీ సేన ఒత్తిడిని అధిగమించి అటాకింగ్ ఫుట్‌బాల్‌ను కొనసాగించింది.
►ALSO READ | వింబుల్డన్ క్వీన్ నోస్కోవా... క్విటోవా తర్వాత అత్యంత పిన్న వయస్కురాలైన చాంపియన్‌గా రికార్డ్...
సెమీస్‌లో మెస్సీ సేన జెండా:
నిర్ణీత సమయం ముగిశాక ఎక్స్‌ట్రా టైమ్‌లో అలసట పడిన స్విట్జర్లాండ్ డిఫెన్స్‌ను అర్జెంటీనా ఫార్వర్డ్ ఆటగాళ్లు పూర్తిగా చీల్చిచెండారు. తమ అనుభవాన్ని ఉపయోగించి కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బ్యాక్-టు-బ్యాక్ రెండు మెరుపు గోల్స్ సాధించి స్విస్ ఆశలపై నీళ్లు చల్లారు. 120 నిమిషాల సుదీర్ఘ పోరాటం తర్వాత 3–1తో ఘనవిజయం సాధించిన అర్జెంటీనా సంబరాల్లో మునిగిపోగా, స్విట్జర్లాండ్ కన్నీటితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ అద్భుత విజయంతో లియోనెల్ మెస్సీ మరోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నాడు.
Argentina GOALLLL 🇦🇷 Alexis Mac Allister finishes off a Lionel Messi assist to give the defending champions a 1-0 lead over Switzerland. #Argentina #Switzerland #Messi #FIFAWorldCup pic.twitter.com/26BN1vTg1p
— Taylor Burr (@TaylorBurr10) July 12, 2026
Look what it means to Lionel Messi, the Argentina squad and their fans 🇦🇷❤️ pic.twitter.com/8SGEMomETS
— Football on TNT Sports (@footballontnt) July 12, 2026
