Vastu tips: ఇంటి నిర్మాణాన్ని ఏ దిక్కు నుంచి ప్రారంభించాలి.. వాస్తుకు పేరు..జన్మ నక్షత్రాల్లో ఏది ముఖ్యం..!

Vastu tips: ఇంటి నిర్మాణాన్ని ఏ దిక్కు నుంచి ప్రారంభించాలి.. వాస్తుకు పేరు..జన్మ నక్షత్రాల్లో ఏది ముఖ్యం..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..  ఇంటినిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే  ఏదిక్కునుంచి ప్రారంభించాలి.. వాస్తు విషయంలో పేరును పరిగణనలోకి తీసుకోవాలా. .. జన్మ నక్షత్రం.. రాశి మొదలైనవి చూడాలా .. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: ఏ ఆటంకం లేకుండా ఇల్లు కట్టాలంటే ఎటువైపు నుంచి కట్టడం మొదలు పెట్టాలి?

జవాబు: పడమర లేదా దక్షిణం వైపు నుంచి నిర్మాణం ప్రారంభిస్తే మంచిది. అయితే నిర్మాణం చేపట్టే స్థలానికి కూడా ఎటువంటి వాస్తు దోషాలు ఉండకూడదు.

ప్రశ్న: పేరునుబట్టి వాస్తు ఉంటుందా? జన్మరాశి, నక్షత్రాలను బట్టి వాస్తు చూపించుకోవాలా? అందరికీ ఒకే వాస్తు వర్తిస్తుందా?

జవాబు: జాతకం, వాస్తు వేరు. అయితే పేరు, నక్షత్రాలను బట్టి ఎవరికి ఎలాంటి ఫేసింగ్ ఉన్న ఫ్లాట్స్ సరిపోతాయో చెప్పొచ్చు. వాస్తు చూపించుకునే ముందు ఇంటి లేదా స్థల యజమాని పేరును కూడాపరిగణనలోకి తీసుకోవాలి.