హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనీ ఆరో ఫేజ్ లోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో భారీ గోల్డ్ స్కామ్ వెలుగుచూసింది. ఖాతాదారుల బంగా రాన్ని అక్రమంగా మరో ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టి సుమారు రూ.10కోట్ల రుణం తీసుకున్నట్లు శాఖమేనేజర్పై ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్ బీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో ప్రియాంక రెడ్డి మేనేజర్గా పనిచేస్తున్నారు.
సాధారణంగా గోల్డ్ లోన్లపై 14 శాతం వరకు వడ్డీ ఉంటుందని, అయితే తమ శాఖలో 6 శాతం వడ్డీకే రుణం ఇస్తామని స్థానికులను ఆమెనమ్మించారు. దీంతో సుమారు 40 మంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నా రు. అయితే ఖాతాదారులు తాకట్టు పెట్టిన బం గారాన్ని మేనేజర్ మరో గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టి సుమారు రూ.10 కోట్ల రుణం తీసు కున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేగాక, ఖాతాదారులు ప్రతి నెల చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని కూడా తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చే యించినట్లు వారు తెలిపారు.
ఇటీవల కొందరు ఖాతాదారులు తమ బంగారాన్ని విడిపించు కునేందుకు ప్రయత్నించగా, మేనేజర్ వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేయడంతో అనుమానం వ్యక్తమైంది. ఆరా తీయగా తమ బంగారం అక్రమంగా మళ్లించిన విషయం తెలిసిందని బాధితులు తెలిపారు. దీంతో శుక్ర వారం సాయంత్రం కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
