పెట్రోల్ ఖర్చులకు బైబై! రూ.10 లక్షల్లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే ఆటోమేటిక్ కార్లు ఇవే !

 పెట్రోల్ ఖర్చులకు బైబై! రూ.10 లక్షల్లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే ఆటోమేటిక్ కార్లు ఇవే !

సిటీ నగరాల్లో, ట్రాఫిక్ జామ్‌లలో పదే పదే గేర్లు మార్చలేక ఇబ్బంది పడుతున్నారా..? పెట్రోల్ బిల్లులు చూసి జేబు ఖాళీ అవుతోందా..? అయితే మీకు ఆటోమేటిక్ గేర్‌ ఫెసిలిటీ, CNG మైలేజ్ తో సేవింగ్స్.. ఈ రెండూ కలిపి ఇచ్చే కార్లు మార్కెట్లోకి వచ్చేశాయి.

ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు అంటే ఎక్కువ రేటు ఉండేవి, పైగా మైలేజ్ తక్కువ ఇచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం  రూ.10 లక్షల్లోపు బడ్జెట్‌లోనే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే ఆటోమేటిక్ CNG కార్లు మార్కెట్లో ఉన్నాయి. ముఖ్యంగా సిటీలో రోజు ప్రయాణించే వారి కోసం బెస్ట్ ఆప్షన్స్ ఇవే..

1. టాటా టియాగో (CNG AMT): 
మీ బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి, మంచి ఆటోమేటిక్ కార్ కావాలనుకుంటే టాటా టియాగో బెస్ట్ ఛాయిస్. దేశంలోనే అతి తక్కువ ధరకు లభిస్తున్న ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG ఆటోమేటిక్ కార్ ఇదే.

ధర: సుమారు రూ.8.08 లక్షల నుండి రూ.9.79 లక్షల వరకు (ఆన్-రోడ్) ఉంటుంది.

ఫీచర్స్: ఇందులో 1.2-లీటర్ పెట్రోల్-CNG ఇంజన్‌తో పాటు 5-స్పీడ్ (AMT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు.

మైలేజ్: కంపెనీ లెక్కల ప్రకారం ఈ మోడల్  కేజీ CNGకి ఏకంగా 28.06 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

ప్లస్ పాయింట్: సిటీ ట్రాఫిక్‌లో హ్యాపీగా, తక్కువ ఖర్చుతో డ్రైవ్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ కార్.

2. టాటా ఆల్ట్రోజ్ (CNG AMT): స్టైల్ అండ్ ప్రీమియం లుక్ 
హ్యాచ్‌బ్యాక్ కార్లలో కాస్త ప్రీమియం లుక్, ఎక్కువ ఫీచర్లు, మంచి సేఫ్టీ కావాలనుకునే వారి కోసం టాటా కంపెనీ ఆల్ట్రోజ్‌లో కూడా CNG ఆటోమేటిక్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

ధర: దీని ఆన్-రోడ్ ధరలు సుమారు రూ.9.96 లక్షల నుండి ప్రారంభమవుతాయి. (టాప్ మోడల్స్ ధర రూ.10 లక్షలు దాటవచ్చు).

ఫీచర్స్: 1.2-లీటర్ ఇంజన్‌తో వచ్చే ఈ కార్‌లో లుక్స్, ఇంటీరియర్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటాయి.

మైలేజ్:  ఈ కార్ కేజీ CNGకి 26.2 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ప్లస్ పాయింట్: లుక్, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

3. టాటా పంచ్ (CNG AMT): మైక్రో SUV లవర్స్ కోసం 
ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) మోడల్ కార్లకు భలే క్రేజ్ ఉంది. చిన్న సైజులోనే SUV ఫీల్ ఇవ్వడంతో టాటా పంచ్ హాట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ఇప్పుడు ఇందులో CNG ఆటోమేటిక్ మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది.

ధర: దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.9.74 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ఫీచర్స్: ఎత్తైన సీటింగ్ పొజిషన్, రోడ్డుపై మంచి గ్రిప్ ఇచ్చే ఈ మైక్రో SUVలో 1.2-లీటర్ ఇంజన్ ఉంటుంది.

మైలేజ్: ఈ మోడల్ కార్ కేజీ CNGకి 26.99 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

ప్లస్ పాయింట్: తక్కువ ఖర్చుతో ఎస్‌యూవీ కారు నడపాలి అనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది చాలా బాగా నచ్చుతుంది.

4. నిస్సాన్ మాగ్నైట్ (AMT + Retrofit CNG): 
టాటా కార్లకు గట్టి పోటీ ఇస్తూ.. నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్ (AMT) కారులో కూడా బయట లేదా షోరూమ్‌లో CNG కిట్‌ను అమర్చుకునే (రెట్రోఫిట్) సదుపాయం ఉంది.

ధర: మనం సెలెక్ట్ చేసుకునే  మోడల్, CNG కిట్‌ను బట్టి దీని ధర రూ.7.83 లక్షల నుండి రూ.11.23 లక్షల వరకు (ఆన్-రోడ్) ఉంటుంది.

మైలేజ్: CNG కిట్ అమర్చిన తర్వాత ఈ మోడల్ కేజీకి సుమారు 24.09 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

 అయితే, కంపెనీ నుంచే నేరుగా వచ్చే (ఫ్యాక్టరీ-ఫిట్టెడ్) CNG కార్లతో పోలిస్తే, బయట కిట్లు అమర్చినప్పుడు వారంటీ, కారు పర్ఫార్మెన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి.

మీరు రోజు సిటీ ట్రాఫిక్‌లో తిరిగే వారైతే... క్లచ్ నొక్కే బాధ లేకుండా, పెట్రోల్ ఖర్చుల ఇబ్బంది లేకుండా  ఉండాలంటే రూ.10 లక్షల లోపు దొరికే ఈ CNG + ఆటోమేటిక్ గేర్ కాంబినేషన్ కార్లు చాలా స్మార్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.