యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం..

యాదగిరిగుట్ట  బోర్డు సభ్యుల  ప్రమాణ స్వీకారం..

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  (YTD) బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం  వైభవంగా జరిగింది. గర్భగుడి బంగారు వాకిలి ప్రాంగణంలో ఆలయ ఈవో జె. భవానీ శంకర్ నూతన బోర్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమితులైన ఎం. సత్యనారాయణ రెడ్డి చేత ఈవో ప్రమాణ స్వీకారం చేయించగా, ఆ తర్వాత మిగతా బోర్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు బోర్డు సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌లు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంత రావు, వైటిడిఏ ఉపాధ్యక్షులు జి. కిషన్ రావు, ఈవో జె.భవానీ శంకర్, ప్రధానార్చకులు కె.వెంకటాచార్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే, పలు అనివార్య కారణాల వల్ల బోర్డు సభ్యులు తూళ్ల విజయేందర్ గౌడ్, నరసింహమూర్తిలతో పాటు.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిలు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.