రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు.. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుంటే శిక్షతోపాటు ఫైన్: సీఈవో సుదర్శన్‌‌రెడ్డి

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు.. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుంటే శిక్షతోపాటు ఫైన్: సీఈవో సుదర్శన్‌‌రెడ్డి
  • డీఎస్‌‌‌‌ఈ సాఫ్ట్‌‌‌‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లు ఏరేస్తం
  • డ్రాఫ్ట్ రోల్‌‌‌‌లో పేరుండాలంటే ఎన్యూమరేషన్​ ఫారం నింపి ఇవ్వాలి  
  • జాబితాలో పేరు లేని వారికి ఆగస్టు 1 నుంచి ఫారమ్-6, 
  • ఫారమ్-8 ద్వారా మరో చాన్స్​
  • ఓటు తీసేయాలంటే ఈఆర్వోలు రాతపూర్వక కారణాలు చూపాలి
  • పట్టణాల్లో  ఇబ్బందులు ఉన్నాయ్​..  
  • దృష్టి పెట్టామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండడం చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఈసీ అందిస్తున్న డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ (డీఎస్‌‌‌‌ఈ) సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌తో డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకొని, ఓటు వేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది  జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తామన్నారు. 

ఇలాంటి కేసుల్లో ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు.  శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సీఈవో సుదర్శన్‌‌‌‌రెడ్డి మాట్లాడారు.  అర్హులైన ప్రతి పౌరుడూ ఓటరుగా నమోదు కావాలన్నదే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్​) ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ బాధ్యతగా వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

ఎన్యూమరేషన్ ఫారమ్ నింపే విధానంపై సీఈవో సుదర్శన్‌‌‌‌రెడ్డి స్పష్టతనిచ్చారు. 2002లో ఓటరుగా ఉన్నవారు ఆ వివరాలను ఫారమ్‌‌‌‌లో నమోదు చేయాలని, ఒకవేళ అప్పట్లో ఓటు లేని పక్షంలో తమ తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు. ఒకవేళ పాత వివరాలు ఏవీ లభ్యం కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పై కాలమ్‌‌‌‌లను ఖాళీగా వదిలేసి, కేవలం ప్రస్తుత వివరాలను మాత్రమే పూరించి సంతకం చేయాలని సూచించారు. 

ఈ ఫారమ్ సమర్పించిన వారి పేర్లు మాత్రమే తదుపరి డ్రాఫ్ట్ రోల్‌‌‌‌లో చోటు దక్కించుకుంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.38 కోట్ల మంది ఓటర్లలో ఎన్యూమరేషన్ ఫారమ్ నింపిన వారి వివరాలు మాత్రమే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలోకి వస్తాయని సీఈవో వెల్లడించారు. ఒకవేళ ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఎవరైనా ఓటర్లు తమ ఫారమ్‌‌‌‌లను సమర్పించలేకపోయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారు ఆగస్టు 1 నుంచి ఫారమ్- 6 (కొత్త ఓటర్ల నమోదు కోసం) లేదా ఫారమ్-8 (సవరణలు, బదిలీల కోసం) ద్వారా దరఖాస్తు చేసుకొని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవచ్చని సూచించారు.

పట్టణ ప్రాంతాల్లో అడ్రస్‌‌‌‌లు కష్టమైతున్నయ్​

పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో బీఎల్‌‌‌‌ఓలు ఇళ్లకు రావడం లేదనే ఫిర్యాదులపై సీఈవో సుదర్శన్‌‌‌‌రెడ్డి స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థాని క అంగన్‌‌‌‌వాడీ, పంచాయతీ సిబ్బందికి అందరూ తెలుస్తారని.. కానీ, నగరాల్లో అపార్ట్‌‌‌‌మెంట్లు, కొత్త నిర్మాణాల కారణంగా అడ్రస్‌‌‌‌లు గుర్తించడం కష్టంగా మారుతోందని అంగీకరించారు. నగరాల్లోని బీఎల్‌‌‌‌ఓల పర్యవేక్షణ బాధ్యతను మరింత కఠినతరం చేయాలని, సూపర్ వైజర్ల సహాయం తీసుకోవాలని జీహెచ్‌‌‌‌ఎంసీ, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.  

ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మణికొండలాంటి ప్రాంతాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లో ఓటరు నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న అంశాన్ని మీడియా ప్రతిని ధులు సీఈవో దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ కమ్యూనికేషన్ లోపం వల్ల, నివాసితుల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ఏ ఒక్క అధికారి కూడా ఫారాలు సేకరించడం లేదని పేర్కొన్నారు. 

దీనిపై సీఈవో స్పందిస్తూ.. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, నివాసితులు తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో తీరిక లేకుండా గడపడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదించిందని, ఈ అపార్ట్‌‌‌‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక డ్రైవ్‌‌‌‌లు నిర్వహించేలా అధికారులను ఆదేశిస్తామని తెలిపారు.

ఓటును తొలగించడం అంత ఈజీ కాదు

 ఓట్లను తొలగించడం అంత సులువు కాదని సీఈవో సుదర్శన్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఓటు తొలగించే ముం దు సదరు ఓటరుకు కచ్చితంగా నోటీసు పంపి సంజాయిషీ కోరుతున్నట్టు చెప్పారు. విచారణ నిర్వహించిన తర్వాత కూడా ఓటరు స్పందించకపోతే ఓటును ఎందుకు తొలగిస్తున్నామనే పూర్తి కారణాల తో ఈఆర్వోలు కచ్చితంగా రాతపూర్వక ‘స్పీకింగ్ ఆర్డర్’ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 

దీనిపై ఓటర్లు కలెక్ట ర్‌‌‌‌కు లేదా సీఈవోకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూలో అందుబాటులో ఉంచడం లేదనే మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. హైదరాబాద్, నిజామాబాద్‌‌‌‌లాంటి ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతం  ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు, ఇంగ్లిష్‌‌‌‌తోపాటు ఉర్దూ భాషలో కూడా ఎన్యూమరేషన్ ఫారాలను ప్రింట్ చేసి పంపిణీ చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశామని, దానికి అనుమతి లభించిందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాషాపర మైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

2009 డీలిమిటే షన్ తర్వాత చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు, నియోజక వర్గాల సరిహద్దులు మారినందున ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..  ఫతేనగర్, సాయినగర్, మల్కాజ్‌‌‌‌గిరి తదితర ప్రాంతాల్లో 2002 నాటి పాత ఓటరు వివరాలు కూడా లభించడం లేదని సీఈవో దృష్టికి తీసుకురాగా.. పాత డేటా అందుబాటులో లేనంత మాత్రాన ఓటును తొలగించబోమని, ప్రత్యేక ఎంక్వైరీ ద్వారా ఓటరు అడ్రస్ వెరిఫై చేసి, నూతన మార్గదర్శకాల ప్రకారం వారి పేర్లను సురక్షితంగా ఓటరు జాబితాలోకి చేర్చేలా 
నిబంధనలు రూపొందించామని తెలిపారు.

 పేర్లలో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్‌‌‌‌ సవరణ 

ఓటరు కార్డులు లేదా ఎన్యూమరేషన్ ఫారాల్లో దొర్లే చిన్నచిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్‌‌‌‌ (ఉదాహరణకు పేర్లలో ‘ఏ’ కి బదులుగా ‘ఈ’ పడడం లేదా ఇంటిపేర్ల తప్పులు) లాంటి వాటిని ‘అనామలీస్’ (స్పష్టత లేని వివరాలు) గా పరిగణిస్తామని సీఈవో సుదర్శన్‌‌‌‌రెడ్డి చెప్పారు. ఇలాంటి తప్పులు ఉన్న వారి ఓట్లను నేరుగా తొలగించబోరని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నోటీసు పీరియడ్‌‌‌‌లో సదరు ఓటర్లు అందించే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్‌‌‌‌ను సరిదిద్దుతామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.