హైదరాబాద్, వెలుగు: కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాకపోవడంతో గత 4 నెలలుగా వేతనాలు అందడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎంఓకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, లోన్ ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
