- పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని బీరంగూడలో ఏర్పాటు చేసిన కిసాన్ షాపింగ్ మాల్ ను శుక్రవారం సినీ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు. అనంతరం మాల్ లో వివిధ వస్త్ర విభాగాలను సందర్శించారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు, ఫోటోలు దిగేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, కిసాన్ షాపింగ్ మాల్స్ అధినేత ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సరసమైన ధరలు, నాణ్యమైన సేవలతోనే వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మార్కెట్ ధరల కంటే తక్కువకే వస్త్రాలను విక్రయిస్తూ ఎదిగామని పేర్కొన్నారు.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కార్యక్రమం లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, మాజీ కార్పొరేటర్ పుష్ప నగేశ్ పాల్గొన్నారు.
