గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ సిటీని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సిటీలోని 50వ డివిజన్ సహకార్ నగర్, రెవెన్యూ కాలనీ, 9వ డివిజన్ కాకతీయ కాలనీలోని సిక్కులవాడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
బాలసముద్రం బంజారా తండాలో ఎమ్మెల్యే కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు హనుమకొండ కలెక్టరేట్లో భద్రకాళి మాడ వీధుల బాధిత కుటుంబాలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాలను ఎమ్మెల్యే కలెక్టర్ చాహత్ వాజ్ పాయ్‌తో కలిసి అందజేశారు.
