ఏడ దాస్కుందం అనుకున్నవ్ భయ్యా.. జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ

ఏడ దాస్కుందం అనుకున్నవ్ భయ్యా.. జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ

జేబులో పట్టే అగ్గి పెట్టె అనుకున్నడో.. స్మార్ట్ ఫోన్ అనుకున్నడో కానీ.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లి నానా హంగామా సృష్టించాడు ఈ డ్రైవర్. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో.. బస్ స్టేషన్ లో పార్క్ చేసిన బస్సుతో ఉడాయించాడు. శుక్రవారం (జులై 10) తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన.. ఆర్టీసీ డిపార్ట్మెంట్ ను అలర్ట్ చేసంది. 

వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన జిట్టబోయిన వెంకన్న డోజర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో నుంచి జనగామకు  వచ్చాడు. బుధవారం రాత్రి 11 గంటలకు ట్రిప్ ముగించుకొని వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సును డ్రైవర్ జనగామ బస్టాండ్లో లో పార్క్ చేసి  ఇంటికి వెళ్లాడు. బస్టాండ్ ఆవరణ కావడంతో బస్సు తాళాలను డ్రైవర్ అలాగే ఉంచి వెళ్లాడు.

 గురువారం తెల్లవారుజామున 3 గంటలకు బస్ స్టేషన్ కు వెళ్లిన వెంకన్.. బస్సు ఎక్కి కాసేపు అటూ ఇటూ చూసి.. తాళం అలాగే ఉండటంతోబస్సును స్టార్ట్ చేశాడు.  సూర్యాపేట మీదుగా 21 కిలోమీటర్లు ప్రయాణించాడు.  దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొన్నాడు. దీంతో గమనించి న టోల్ గేట్ సిబ్బంది ఆరా తీయగా వెంకన్న మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. 

బస్సు లో కండక్టర్ లేకపోవడం, ప్యాసెంజర్లు లేకపోవడంతో.. పరిస్థితిని గమనించి దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఆరా తీయగా మద్యం మత్తులో బస్సును తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో బస్సును, వెంకన్నను జన గామ పోలీసులకు అప్పగించారు. 

దీనిపై అద్దె బస్సు యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సత్య నారాయణరెడ్డి తెలిపారు. మద్యం మత్తు, మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవ డంతోనే బస్సును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.