ఫ్రాన్స్ గెలిచింది.. నోరా ఫతేహి ఏడ్చింది.. నెట్టింట వీడియో వైరల్!

ఫ్రాన్స్ గెలిచింది.. నోరా ఫతేహి ఏడ్చింది.. నెట్టింట వీడియో వైరల్!

ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్ చేతిలో మొరాకో జట్టు 2–0 తేడాతో ఓటమిపాలవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మొరాకో అద్భుతమైన ప్రపంచకప్ ప్రస్థానం ఇలా ముగిసిపోవడంతో.. ఆ జట్టుకు వీరాభిమాని అయిన బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మొరాకో మూలాలున్న నోరా, ఈ టోర్నీ మొత్తం ఆట్లాస్ లయన్స్ (మొరాకో జట్టు) కు సపోర్టర్‌ చేసింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఈ కీలక పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆమె స్టేడియానికి వెళ్లింది. కానీ మొరాకో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఫ్రాన్స్ విజయం సాధించడంతో గ్రౌండ్ లోనే నోరా కన్నీళ్లు పెట్టుకుంది.  

స్టేడియంలోనే ఏడ్చిన బాలీవుడ్ బ్యూటీ: 

మ్యాచ్ ముగిసి మొరాకో ఓడిపోయిన వెంటనే, నోరా ఫతేహి స్టేడియం లోపలి నుంచి ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో మొరాకో ఓటమి తర్వాత స్టేడియంలోని అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ క్లిప్‌తో పాటు ఇది చాలా ఎమోషనల్ గా అనిపించిందని నోరా పేర్కొంది. ఘోర పరాజయం ఎదురైనప్పటికీ, టోర్నీ అంతటా మొరాకో ప్లేయర్స్ చూపిన పట్టుదలను, పోరాట పటిమను ఆమె ఎంతగానో అభినందించారు.

►ALSO READ | 141 కిమీ వేగంతో వచ్చిన బంతి.. షాట్ మాత్రం 360 డిగ్రీలు.. శ్రేయస్ కొట్టిన సిక్స్ చూస్తే షాకే!

ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మనసులు గెలిచిన మొరాకో:

ఫిఫా వరల్డ్ కప్ 2026లో మొరాకో ప్రయాణం నిజంగా చిరస్మరణీయంగా నిలిచింది. ఎన్నో బలమైన ప్రత్యర్థి జట్లని ఓడిస్తూ క్వార్టర్ ఫైనల్ వరకు దూసుకొచ్చిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల మనసులను గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై తాము ఎంతటి బలమైన జట్టో మొరాకో మరోసారి నిరూపించుకుంది. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, చారిత్రాత్మక ప్రదర్శనతో మొరాకో ప్లేయర్స్ కు ఎంతగానో సపోర్టు చేశారు. సోషల్ మీడియాలో నోరా ఫతేహి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.