మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 రకాల విభిన్న ట్రేడుల్లో మొత్తం 495 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి .
వయోపరిమితి: 14 నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జులై 15.
ఆన్లైన్ ఎగ్జామ్ డేట్: జులై 25.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ mazagondock.inను సందర్శించండి.
►ALSO READ | బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు: మొత్తం 231 పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా చేసినోళ్లకు ఛాన్స్..
