బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు: మొత్తం 231 పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా చేసినోళ్లకు ఛాన్స్..

 బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు: మొత్తం 231 పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా చేసినోళ్లకు ఛాన్స్..

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎస్ఆర్​సీఎల్) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: టెక్నీషియన్. 

మొత్తం ఖాళీలు: 231. 

ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ (పదో తరగతి) ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇండియన్ రైల్వేస్, రైల్వేలు, మెట్రో రైల్వేలు లేదా ఆర్ఆర్టీఎస్ వ్యవస్థల ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ విభాగాల్లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 7. 

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ. 400. ఎస్సీ/ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.  

లాస్ట్ డేట్: ఆగస్టు 5. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూట్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), డాక్యుమెంట్  వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక 
చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nhsrcl.inను సందర్శించండి.