మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం: ఇండియన్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు

 మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం: ఇండియన్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు

భారత సైన్యంలో కమిషన్డ్​ ఆఫీసర్లుగా చేరేందుకు మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం. ఇండియన్ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉమెన్ కోర్స్ (2027, ఏప్రిల్) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహిత మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతోపాటు రక్షణశాఖ సిబ్బంది వితంతులకు టెక్నికల్, నాన్-–టెక్నికల్ (నాన్–-యూపీఎస్‌సీ) కేటగిరీల కింద దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జులై 8  నుంచి ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 6.

పోస్టు పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ – ఎస్ఎస్​సీ(టీ)–68.

మొత్తం ఖాళీలు: 30. 

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్/ ఆర్కిటెక్చర్ – 7, కంప్యూటర్ సైన్స్/ ఐటీ 4, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్/ ప్రొడక్షన్/ ఎరోనాటికల్ 9, రక్షణశాఖ సిబ్బంది వితంతులకు (టెక్నికల్ & నాన్-టెక్నికల్) - 2 పోస్టులు (ప్రత్యేక కేటగిరీ).

ఎలిజిబిలిటీ: అవివాహితులైన మహిళా అభ్యర్థులు 2027, ఏప్రిల్ 1 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు.  

రక్షణశాఖ సిబ్బంది వితంతులకు: నాన్-టెక్నికల్ పోస్టులకు ఏదైనా గ్రూప్‌లో డిగ్రీ, టెక్నికల్ పోస్టులకు బీఈ/ బి.టెక్​లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2027, ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. లేదా 2000, ఏప్రిల్ 1 నుంచి 2007, మార్చి 31 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 

రక్షణశాఖ సిబ్బంది వితంతులు: 2027, ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల గరిష్ట వయసు 35 ఏళ్లు మించకూడదు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 8.

లాస్ట్ డేట్: ఆగస్టు 6. 

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ: 2026, అక్టోబర్ – డిసెంబర్. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, ఆధారంగా అభ్యర్థులను 
ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించండి. 

శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ ర్యాంకులో ప్రొబేషన్‌పై షార్ట్ సర్వీస్ కమిషన్ మంజూరు చేస్తారు. ప్రి-–కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (పీసీటీఏ)లో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం సదరు అధికారికి లెఫ్టినెంట్ ర్యాంకులో షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మంజూరు చేస్తారు.

శిక్షణా కాలంలో స్టైపెండ్: సర్వీస్ అకాడమీ (ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ -–పీసీటీఏ)లో శిక్షణ పొందే క్యాడెట్లకు శిక్షణా కాలంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. 

►ALSO READ | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్రెంటీస్ జాబ్స్.. లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా ఎంపిక.. డిగ్రీ ఉంటే ట్రై చేయండి..