కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (TOXIC). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ నటిస్తుండగా, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాయా టీజర్, లేడీస్ & లేడీస్ పేరుతో వచ్చిన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే మూవీలో నటించిన స్టార్ యాక్టర్స్ గురించిన ఓ వార్త వైరల్గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ కోసం యశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాకుండా సినిమా లాభాల్లో కూడా వాటా పొందనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే హీరోయిన్ కియారా అద్వానీ తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ అమౌంట్ రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కీలక పాత్రలో నటిస్తున్న రుక్మిణి వసంత్, తారా సుతారియలకు చెరో రూ.3 కోట్లు కాగా, హుమా ఖురేషికి రూ.2 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాల సమాచారం. ముఖ్యంగా నయనతార రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. నిమిషానికి కోటి తీసుకున్నట్టుగా టాక్.
"Tabaahi isn't just a song—it's the emotional heartbeat of #Toxic." ❤️🔥
— Ashwani kumar (@BorntobeAshwani) July 8, 2026
From #VishalMishra's haunting composition to the explosive chemistry between #Yash and #KiaraAdvani, #Tabaahi delivers romance that's bold, obsessive, and visually breathtaking.
Director #GeetuMohandas… pic.twitter.com/NNd6XmoVQg
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గని నయన్..
ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొదట ఆమె ఈ పాత్ర కోసం రూ. 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, మేకర్స్‌తో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం రూ.12 కోట్లకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ రేంజ్ లో సౌత్ ఇండియాలో ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం నయనతార క్రేజ్‌కు నిదర్శనమని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
‘టాక్సిక్’లో పవర్ ఫుల్ ఎంట్రీ..
'కేజీఎఫ్' సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యష్ సరసన నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె 'గంగ' అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన నయనతార గన్ పట్టుకుని ఉన్న ఒక పోస్టర్ నెట్టింట సెన్సేషన్ సృష్టించింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా ఆమె అదరగొట్టనుందని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది.
Nayanthara as GANGA in - A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie pic.twitter.com/KpvfohTYD4
— Nayanthara✨ (@NayantharaU) December 31, 2025
ఇక ‘టాక్సిక్’ కెప్టెన్ ఆఫ్ ది షిప్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ భారీ మొత్తంలో, అంటే కోట్లలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఆమెకు వ్యక్తిగత పారితోషికం ఎంత అనేది అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఆమె మరియు సీనియర్ టెక్నీషియన్స్ బృందానికి కలిపి మొత్తం రూ100 కోట్లకు పైగా అని సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
►ALSO READ | Rashmika Mandanna: ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన రష్మిక
రిలీజ్ డేట్ ఫిక్స్..
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణతో కలిసి యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో షూట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డబ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 26, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 26న ఓణం, ఈద్-ఎ-మిలాద్ వంటి పండుగలు ఉండటంతో పాటు రక్షాబంధన్ వీకెండ్ కూడా కలిసి రావడం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ రేంజ్‌ను మరింత పెంచుతుందని అభిమానులు భావిస్తున్నారు.
