RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’కు నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’కు నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

‘బ్లాస్ట్’ సినిమాలో కరాటే మాస్టారు రాజారాం (యాక్షన్ కింగ్ అర్జున్) కూతురు నీల (ప్రీతి ముకుందన్) గుర్తుంది కదా. మానసికంగా, శారీరకంగా దృఢమైన ఆడపిల్లగా ప్రీతి నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్.. కరాటే నేర్చుకున్న నీల పాత్రలో నటించి దుమ్మురేపింది. చూడడానికి నాజూకుగా, అందంగా, లక్షణంగా ఉన్న నీల.. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం బేలగా, భయంగా ఒకరి ఆశ్రయం కోరక తనకోసం తాను నిలబడగలిగే ధీర వనితగా నటించి అదరగొట్టింది. ఇపుడు ఈ తమిళ యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకొచ్చింది. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం కోల్పోయినట్లు డైరెక్టర్ వెల్లడించారు. 

‘రాకా’లో ఛాన్స్ ఎందుకు మిస్ అయింది?

ఐకాన్ట్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకా’(Raaka). సుమారు రూ. 700 కోట్లకు పైగా బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. లేటెస్ట్గా ఈ చిత్రం తెరవెనుక జరిగిన కీలక ఇన్సిడెంట్ని చెప్పుకొచ్చారు డైరెక్టర్ అట్లీ. తాజాగా తమిళ రొమాంటిక్ కామెడీ ‘హృదయం మురళి’ సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో అట్లీ మాట్లాడుతూ.. రాకా మూవీలో ఓ కీలక పాత్ర కోసం మొదట ప్రీతీ ముకుందన్‌ను (Preity Mukhundhan) సంప్రదించినట్లు అట్లీ వెల్లడించారు.

‘రాకా’లో ఒక కీలక పాత్ర కోసం మొదట ప్రీతీ ముకుందన్‌ను సంప్రదించామని, అయితే అప్పటికే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్లు కుదరక ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అనంతరం ఆ పాత్రను నటి ఫెమినా జార్జ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాదు, ప్రీతీ నటనకు తాను పెద్ద అభిమానినని, ‘రాకా’లో కలిసి పని చేసే అవకాశం మిస్ అయినా భవిష్యత్తులో తప్పకుండా ఆమెతో ఓ సినిమా చేస్తాననే ఆశాభావాన్ని అట్లీ వ్యక్తం చేశారు.

‘బ్లాస్ట్’ విజయంతో ఫుల్ బిజీ..

ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్’ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రీతీ ముకుందన్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ముందే ఒప్పుకున్న ప్రాజెక్టుల డేట్ల కారణంగానే ‘రాకా’ వంటి భారీ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనమని సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

►ALSO READ | VenkyAnil5: వెంకీ రాకతో జోరందుకున్న అనిల్ మల్టీస్టారర్.. సెట్స్‌లో ఏం జరుగుతోందంటే?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

‘హృదయం మురళి’ జూలై 10న విడుదల

తమిళ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ‘ఇదయం మురళి’ తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అథర్వ మురళి, ప్రీతి ముకుందన్, కయదూ లోహర్ ప్రధాన పాత్రలు పోషించగా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, నటుడిగా సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.