Rashmika Mandanna: ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన రష్మిక.. డూప్ లేకుండా నీటిలో 20 గంటల పాటు షూటింగ్

Rashmika Mandanna: ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన రష్మిక.. డూప్ లేకుండా నీటిలో 20 గంటల పాటు షూటింగ్

రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’(Mysaa). రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రాన్ని  అన్‌‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.  తాజాగా ఈ సినిమా కోసం రష్మిక రిస్కీ సీన్స్‌‌లో నటించిందని టీమ్ తెలియజేసింది.  రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల పాటు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్‌‌వాటర్ ఫైట్ సీక్వెన్స్‌‌ను చిత్రీకరించగా, ఈ సీన్స్ కోసం  బాడీ డబుల్‌‌ను ఉపయోగించకుండా రష్మిక స్వయంగా నటించింది.

సన్నివేశాల్లో సహజత్వం కోసం ఆమె చూపించిన డెడికేషన్ మూవీ  టీమ్‌‌ను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు.  ఈ సీన్స్ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తాయని చెప్పారు.  ఇందులో  గోండు గిరిజన తెగకు చెందిన పవర్‌‌‌‌ఫుల్ ఉమెన్‌‌గా రష్మిక కనిపించనుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌లో రష్మిక క్యారెక్టర్‌‌‌‌ను ఇంట్రడ్యూస్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్.  ఈశ్వరీరావు, సోమసుందరం, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.