ఆధ్యాత్మికం: భోజనం చేసేముందు అన్నపూర్ణాదేవిని ఎందుకు ప్రార్థించాలి.. భారతీయ సంప్రదాయాల రహస్యం ఇదే..!

ఆధ్యాత్మికం:  భోజనం చేసేముందు అన్నపూర్ణాదేవిని ఎందుకు ప్రార్థించాలి..  భారతీయ సంప్రదాయాల రహస్యం ఇదే..!

అన్నం పరబ్రహ్మ స్వరూపం..  ఏది లోపించినా బ్రతకగలం. కానీ గాలి.. నీరు.. ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు.. అందుకే పూర్వకాలంలో భోజనం చేసేటప్పుడు ముందుగా ఇష్ట దైవాన్ని స్మరించుకొని.. ఆ తరువాత ఎదురుగా ఉన్న భోజన పదార్దాలకు నమస్కారం చేసుకొని తినేవారు. భారతీయ సంప్రదాయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకుందాం...!

అన్నపూర్ణదేవి అనుగ్రహం ఉంటేనే నిత్యం భోజనం చేయగలం.  ఆ దేవి ఆశీస్సుల కోసం దేవుడిని స్మరించుకుంటారు.  అందుకే మాకు ఎల్లవేళలా ఆ మాత అనుగ్రహం ఉండాలని ముందుగా నైవేద్యం.. నివేదన ఇచ్చి భగవంతుడిని సమర్పించే సంప్రదాయం భారతీయులు కొన్ని యుగాలుగా ఆచరిస్తున్నారు.  దీనివలన మానశిక ప్రశాంతత పిల్లలల్లో మంచి విలువలు పెంపొందిస్తాయని పండితులు చెబుతున్నారు.  

ప్రస్తుత యగంలో భోజనం చేసేటప్పుడు కనీసం కాళ్లు కూడా కడుక్కోవడం లేదు.  కొంతమందైతే పాద రక్షలతోనే భుజిస్తున్నారు. అందుకే కలియుగంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు.. విచిత్ర ధోరణికి ఇదే కారణమంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు..  

పూర్వకాలంలో.. సంప్రదాయాలకు.. ఆచారాలకు ఎంతో విలువ ఇచ్చేవారు.  అందుకే భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని దైవ ప్రసాదంగా భావించేవారు. అందుకే భోజనం చేసేటప్పుడు దేవుడిని స్మరించుకొని... అన్నపూర్ణదేవికి ( ఎదురుగా ఉన్న భోజన పదార్దాలకు) నమస్కారం చేసి ఆ తరువాత తినేవారు. 

 ప్రస్తుతం జీవనశైలి మారింది.. ఈ స్పీడ్​ యుగంలో చాలా బిజీ లైప్​.  పరుగులు పెడితేనే పోటీపడగలం.  అందుకే ఏదో గబ గబ తింటూ.. పొట్ట నింపుకుంటున్నారు.  కొంతమందైతే.. కూర్చున్న చోటే భోజనం చేస్తున్నారు.  ఇలా జీవితంలో గడిపేవారు చేతులు కడుక్కొని గబ గబ తింటారు.  అలాతినడం వలన ఆరోగ్య సమస్యలతో పాటు ఆలోచన విధానంలో చాలా మార్పులొస్తాయని పండితులు చెబుతున్నారు.

►ALSO READ | జ్యోతిష్యం: యోగిని ఏకాదశి స్పెషల్.. జులై 10న తొమ్మిది పరిహారాలు.. జీవితాన్నే మార్చేస్తాయి..!

సమమాభావం వలన అలా చేయాల్సి వస్తే.. కనీసం కాళ్ల బొటన వేళ్లను నీటితో తుడుచుకొని.. ఎలాగు చేతులు కడుక్కుంటాం కదా..! ఆ తరువాత.. బాక్స్​ మూత తీసి.. దండం పెట్టి.. ఆతరువాత తినాలని చెబుతున్నారు.  ఇలా తినడం వలన అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. 

హిందూ సంప్రదాయం ప్రకారం మనకు లభించే ప్రతి గింజలో దేవుని కృప, ప్రకృతి ఆశీర్వాదం, రైతు శ్రమ దాగి ఉంటాయి. అందుకే భోజనం ప్రారంభించే ముందు దేవుడికి కృతజ్ఞతలు తెలిపి రైతులకు గౌరవం ఇవ్వడం..  వినయానికి ప్రతీకగా పరిగణిస్తారు.  భోజనం చేసే ముందు కొన్ని క్షణాలు దేవుడిని ధ్యానించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. 

అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసి ఆహారం తింటే దానివలన వచ్చే శక్తితో మంచి ఆలోచనలు వస్తాయి.   కోపం, ఆందోళన, ఒత్తిడి వంటి భావాలు తగ్గి, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే ఆహారం శరీరానికే కాకుండా మనసుకూ మేలు చేస్తుందని భావిస్తారు. 

 హిందువులు.. భారతీయ సంప్రదాయం ప్రకారం   ముందుగా వండిన పదార్దాలను దేవుడిరి నైవేద్యం సమర్పించిన తరువాతే తింటారు.  దేవునికి నివేదన ఇచ్చిన ఆహారాన్ని ప్రసాదంగా భావించి తినడం వలన శాంతి.. సంతోషం.. ఐశ్వర్యం వృద్ది చెందుతాయి.   మీరు ఆఫీస్​ క్యాంటిన్లో తిన్నా.. ఫంక్షన్​లలో తిన్నా.. హోటల్స్​ లో తిన్నా ముందుగా మీ ఎదురుగా ఉన్న ఆహార పదార్దాలకు నమస్కరించిన తరువాతనే తినాలని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.