మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారు. రవి నేలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘ప్రేమ మళ్లీ చిగురిస్తుంది ’(Love Will Spark Again)) అనే అందమైన ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విలేజ్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Love will feel a little extra special with 'Sri Sri' 💕#DQ41 is #SriSri ❤️#LoveWillSparkAgain pic.twitter.com/bRJfMeg4r5
— SLV Cinemas (@SLVCinemasOffl) July 10, 2026
టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. కాలేజీ గోడపై కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించిన దుల్కర్, పూజా జోడీ ఎంతో ఫ్రెష్‌గా ఆకట్టుకుంది. ప్రేమకథతో పాటు హ్యూమన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
►ALSO READ | TOXIC Remuneration: 12 నిమిషాల పాత్రకు నయన్ రూ.12 కోట్లా? యశ్, కియారా ‘టాక్సిక్’ కోసం కోట్లలో రెమ్యునరేషన్లు?
#DQ41 wraps up a schedule where key sequences were shot ❤🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) May 24, 2026
Next schedule begins soon.
Wait for the title announcement ⏳#SLVC10
Starring @dulQuer, @hegdepooja, @meramyakrishnan, @Dheekshiths, @IamJagguBhai
Directed by @ravinelakuditi9
Music by @gvprakash
Cinematography by… pic.twitter.com/8k6Grajb0Q
వరుస ఫెయిల్యూర్స్.. పూజా రెమ్యునరేషన్ వైరల్:
ఇదిలా ఉంటే, ‘శ్రీ శ్రీ’తో పూజా హెగ్డే మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం పూజా సుమారు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 'రాధేశ్యామ్', 'ఆచార్య' చిత్రాల తర్వాత, అలాగే 'ఎఫ్3'లో స్పెషల్ సాంగ్ అనంతరం పూజా హెగ్డే తెలుగులో పూర్తి స్థాయి సినిమా చేయలేదు. ఇప్పుడు దుల్కర్‌తో కలిసి నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ 'ద్వారా పూజా హెగ్డే టాలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
