మహబూబాబాద్, వెలుగు: తెలంగాణ కొంగుబంగారంగా నిలిచే బయ్యారంలో తక్షణమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
రాష్ట్ర విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, అది నేటికీ అమలుకాకపోవడం విచారకరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రకు చెందిన కొంతమంది బయ్యారం ఉక్కుగనులను ఆక్రమించాలని చూస్తే ఆనాడు పోరాటాలు చేసినట్లు చెప్పారు. బయ్యారం ఉక్కు గనులను తక్షణం సింగరేణికి అప్పగించాలని కోరారు.
