మెదక్ టౌన్, వెలుగు : విద్యార్థినుల భద్రతను పెంపొందించడం, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడం, స్నేహపూర్వక పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసు శాఖ చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో విద్యార్థినులకు భరోసాగా నిలిచేందుకు ‘పోలీస్ అక్క’ నిరంతరం పర్యవేక్షిస్తూ ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా వారిని సంప్రదించాలని లేదా డయల్-112, షీ-టీమ్స్‌ను ఆశ్రయించాలని సూచించారు.
