- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
తొగుట (దుబ్బాక) వెలుగు : దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రోడ్లు, మున్సిపల్, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వివరించారు.
దుబ్బాకకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దుబ్బాక చేనేత నూతన కార్యవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత దుబ్బాకలో కోర్టు నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన, మౌలిక వసతులపై అధికారులతో కలిసి పరిశీలించారు.
