ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా మెుదలైన కల్లోలం ఇప్పుడు స్టాక్ మార్కెట్లతో పాటు బులియన్ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తోంది. దీంతో మెున్నటి వరకూ తగ్గుతూపోయిన విలువైన లోహాల రేట్లు మళ్లీ జనానికి చుక్కలు చూపిస్తూ పెరిగిపోతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్.
జూలై 10న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.38 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 482గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 275గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 10, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పు లేకుండా రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
