ఎక్మీ గ్రీన్‎తో మిత్సుబిషి రూ.9 వేల 500 కోట్లు భారీ డీల్

ఎక్మీ గ్రీన్‎తో మిత్సుబిషి రూ.9 వేల 500 కోట్లు భారీ డీల్

 గ్రీన్ మెథనాల్ సరఫరా కోసం క్లీన్ ఎనర్జీ సంస్థ ఎక్మీ గ్రీన్ మాలిక్యూల్స్​ , జపాన్‌‌‌‌కు చెందిన మిత్సుబిషి గ్యాస్ కెమికల్ కంపెనీ మధ్య  ఒప్పందం కుదిరింది. ఏక్మీ  ఏటా లక్షల టన్నుల గ్రీన్ మెథనాల్‌‌‌‌ను మిత్సుబిషికి సరఫరా చేయనుంది. ఈ భాగస్వామ్యం విలువ  బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,500 కోట్లు)ఉంటుంది. పర్యావరణహిత సముద్ర ఇంధన రంగంలో భారత కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి. సంప్రదాయ సముద్ర ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ మెథనాల్ పనిచేస్తుందని ఎక్మీ తెలిపింది.