ఫ్రాన్స్రాజధాని పారిస్లో నిర్వహించిన హాట్ కొత్యూర్ఫ్యాషన్ వీక్‌లో హైదరాబాద్కు చెందిన బిలియనీర్సుధా రెడ్డి రూ.250 కోట్ల విలువైన (30 మిలియన్ డాలర్లు) ఆభరణాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె పర్సనల్జ్యూయలరీ కలెక్షన్లో వందలాది వజ్రాలు పొదిగిన నగలు, 75 క్యారెట్ల డైమండ్ బో నెక్లెస్, డైమండ్ హెయిర్ జ్యూయలరీ, కస్టమ్ టర్కోయిస్ ఇయర్ కఫ్, భారీ పచ్చ, కెంపు ఉంగరాలు ఉన్నాయి. సుధ భర్త కృష్ణారెడ్డి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఎండీగా వ్యవహరిస్తున్నారు.
