గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్లు దిశానిర్దేశం

గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్లు దిశానిర్దేశం

నల్గొండ/సూర్యాపేట/మహబూబ్ నగర్ కలెక్టరేట్/మెదక్​ టౌన్, వెలుగు:   వివిధ జిల్లాల్లో నిర్వహించిన శిక్షణ, సమీక్షా సమావేశాల్లో మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, బి. చంద్రశేఖర్, ప్రతిమాసింగ్, తేజస్ నంద్ లాల్ పవార్లు పాల్గొని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. 

మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రజాప్రతినిధులు, -అధికారుల సమన్వయం, సీజనల్ వ్యాధుల నివారణపై పలు సూచనలు చేశారు. నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’పథకం ద్వారా గ్రామానికి నిజంగా ఉపయోగపడే ప్రాజెక్టులు, నీటి సంరక్షణ పనులు చేపట్టాలని సూచించారు. 

మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ స్థానిక సహజ వనరుల ద్వారా గ్రామపంచాయతీల్లో ఆదాయాన్ని పెంపొందించుకోవడంతో పాటు పిల్లలలో పోషకాహార లోపం నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మంజూరైన పనులను త్వరగా పూర్తి చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు