హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు కేవలం ఫ్యాషన్ ర్యాంప్‌లకే పరిమితమైన చంకీ సోల్స్శాండల్స్ను ఫుట్‌వేర్ బ్రాండ్ స్పార్క్స్ యూత్ కోసం పరిచయం చేసింది. ఈ సరికొత్త కలెక్షన్‌ను ప్రచారం చేయడానికి ప్రముఖ నటుడు చంకీ పాండేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆయన పేరులోని చంకీ అనే పదానికి, ఈ ప్రొడక్ట్ శైలికి ఉన్న పోలికను హాస్యంతో ముడిపెట్టి ఇంటర్నెట్ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ ప్రచారాన్ని రూపొందించింది. ఫ్యాషన్, సౌకర్యం రెండింటినీ ఒకేచోట అందిస్తూ తమ బ్రాండ్‌ను విస్తరిస్తున్నామని స్పార్క్స్ తెలిపింది.
