అనువైన పంటల సాగుపై అవగాహన కల్పించాలి..ఎల్ నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలు

అనువైన పంటల సాగుపై అవగాహన కల్పించాలి..ఎల్ నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలు
  •      వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: వాతావరణంలో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ, అనువైన పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూరాల, రామన్ పాడ్ రిజర్వాయర్లలో నీటి లభ్యతపై ఆరా తీయగా, నీటి ప్రవాహం లేకపోవడంతో ఉన్న నిల్వలు తాగునీటికే సరిపోతాయని ఇరిగేషన్ సీఈ రహీముద్దీన్ వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో బోరు సౌకర్యం ఉండి రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులతో పామాయిల్ తో పాటు మినుములు, కందులు వంటి ఆరుతడి పంటలు సాగు చేయించేలా మండలాల వారీగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే భూ రీసర్వే పనులు, భూ భారతి పెండింగ్ ఫైళ్లు, భూ సర్వే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి రైతులకు పారదర్శక సేవలు అందించాలని స్పష్టం చేశారు.