కల్వకుర్తి, వెలుగు : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం వెల్దండ పట్టణంలోని ఆకృతి గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాచమల్ల సిద్ధేశ్వర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆయిల్ల శ్రీనివాస్ గౌడ్, ఆర్డీవో జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
