- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ఖిల్లాగణపురం/రేవల్లి, వెలుగు : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, మార్కెటింగ్ వ్యవస్థను గ్రామీణ స్థాయికి చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం వనపర్తి నియోజకవర్గానికి రెండు నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులను మంజూరు చేయడం రైతులకు ఎంతో ప్రయోజనకరమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
గురువారం గోపాల్‌పేట, ఖిల్లాగణపురం-పెద్దమందడి మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కొత్త మార్కెట్ యార్డులతో వేలాది మంది రైతులకు రవాణా ఖర్చులు, సమయం ఆదా అవుతాయని, త్వరలోనే ఆధునిక గోదాముల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఖిల్లా గణపురం-పెద్దమందడి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా క్యామ నవనీత, వైస్ చైర్మన్‌గా కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డి, గోపాల్‌పేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వెంకటేశ్, వైస్ చైర్మన్‌గా సత్యశీలారెడ్డి డైరెక్టర్లు పదవీ ప్రమాణస్వీకారం చేశారు.
