Adhe Neevu Adhe Nenu: గేటెడ్ కమ్యూనిటీలో షాకింగ్ క్రైమ్.. దిల్ రాజు చేతుల మీదుగా కొత్త టీజర్..

Adhe Neevu Adhe Nenu: గేటెడ్ కమ్యూనిటీలో షాకింగ్ క్రైమ్.. దిల్ రాజు చేతుల మీదుగా కొత్త టీజర్..

‘కమిటీ కుర్రోళ్లు’  ఫేమ్  త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల,  ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్  తన్వీ నేగి హీరో హీరోయిన్స్‌‌గా నటిస్తున్న సినిమా ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో  గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సందర్భంగా  డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ ‘గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో  యూత్‌‌కు  కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది. ప్రస్తుతం సొసైటీలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ఆలోచన లేకుండా వేసే తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది ఇందులో చూపించబోతున్నాం’ అని చెప్పాడు.  త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌‌ను ప్రకటిస్తామని  ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల అన్నారు.