AGADHA Movie Release: ఎంఎస్ రాజు మైథాలజీ, థ్రిల్లర్.. ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

AGADHA Movie Release: ఎంఎస్ రాజు మైథాలజీ, థ్రిల్లర్.. ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అగధ’(AGADHA). కాశీ విశాలాక్షి బలుసు  నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా, వనిత  విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎంఎంస్ రాజు మాట్లాడుతూ ‘ఇది  నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో   ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉన్నాయి.   ప్రతి  ఫ్రేమ్‌‌‌‌ విజువల్ వండర్‌‌‌‌లా అనిపిస్తుంది.  అలాగే ఎమోషన్స్‌‌కి ప్రాధాన్యం ఇస్తూ  ప్రతి ఆర్టిస్ట్,  ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పనిచేశారు.

మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో  ఎమోషనల్ రోలర్ కోస్టర్  రైడ్‌‌లా ఉంటుంది’ అని చెప్పారు. ఇందులో పోషించిన మహాదేవి పాత్ర  తన కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోతుంది అని కామాక్షి భాస్కర్ల చెప్పింది. ‘అగధ’ను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించామని  నిర్మాత కాశీ విశాలాక్షి  అన్నారు.